హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని రెయిన్ బో హాస్పిటల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొంది. ఆ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ తో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారు డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.