శనివారం ( ఆగస్టు 17, 2024 ) జరిగినను ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలోని విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి మెహదీపట్నం వెళ్తున్న కారు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న చోట మట్టి గడ్డపైకి దూసుకెళ్లింది కారు. జాతీయరహదారిపై ఎలాంటి సైన్ బోర్డ్స్ లేకుండా రోడ్డు పనులు జరుగుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజుల్లోనే ఇది రెండో ఘటన కావడం గమనార్హం.సైన్ బోర్డ్స్ లేకుండా పనులు చేపట్టిన హైవే అథారిటీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అంటున్నారు. హైవే అథారిటీ నిర్లక్షంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.