వా.. ఏం అన్న ఐడియానా ఉరికెనా కారు కదా.. మరి గవర్నమెంట్ ఆఫీసర్లు. అమెరికాలోని కెంబ్రిడ్జ్ ప్రాంతంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు. మిల్టన్ రోడ్ లోని లెబ్రరీలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. కానీ అనుకోని సమస్యల కారణంగా లెబ్రరీ డోర్లు తెరుచుకోలే.. ఓటింగ్ ప్రారంభమైయ్యే సమయం దగ్గరపడుతుంది.. అయినా లైబ్రరీ ఓపెన్ అవ్వట్లే. అప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లు తమ మెదడుకు పని పెట్టి సమయస్పూర్తి ప్రదర్శించారు.
ఎన్నికల విధులకు వచ్చిన అధికారుల కారు డిక్కీ ఓపెన్ చేసి పోలింగ్ బూత్‌గా మార్చారు. ఉదయం 7గంటల నుంచి గంటపాటు అందులోనే పోలింగ్ నిర్వహించారు. కారు డోర్ హ్యాండిల్స్ కు పోలింగ్ బూత్ సింబల్స్ వేలాడదీశారు. గ్లా్స్ విండోస్ కు అభ్యర్థుల వివరాలు అతికించారు. కారు డిక్కీ ఓపెన్ చేసి ఓటింగ్ మిషిన్ వెనుక పెట్టారు. ఉదయాన్నే వచ్చిన ఓటర్లకు అసౌకర్యం కలిగించకుండా అమెరికాలో పోలింగ్ సిబ్బంది అలా ప్లాన్ చేశారు.