హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు శివారులోని ఎరసాని గూడెం వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎండీ ఇద్దాక్ (21), ఎస్ కే.సమీర్ (21), ఎస్ కే.యాసీన్ (18)గా గుర్తించారు. బాధితులందరూ ఖమ్మం వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.