కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టాటా ఏస్ ఆటో ఢీ కొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి.
క్షతగాత్రులను హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. గొల్లపల్లికి చెందిన 20 మంది మహిళా కూలీలు ధర్మరాజపల్లి గ్రామంలో నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.