లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముందుకెళ్లని సెబీ చీఫ్ కేసు

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముందుకెళ్లని సెబీ చీఫ్ కేసు

న్యూఢిల్లీ: సెబీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాధవి పురి బచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎంపీ మహువా మొయిత్రి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసిన ఫిర్యాదు ముందుకు కదల్లేదు. కేవలం హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ చేసిన ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేపట్టలేమని, ఆధారాలు సరిపోలేదని యాంటి కరప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబుడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరించింది.  సెబీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూ వివిధ లిస్టెడ్ కంపెనీల నుంచి మాధవి, ఆమె భర్త దవళ్ బచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రూ. కోట్లు సంపాదించారని, అదానీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షోర్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీరికి వాటాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన విషయం తెలిసిందే.

మాధవిపై లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ  మహువా మొయిత్రి ఈ నెల 13న ఫిర్యాదు చేశారు.  హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ ఈ ఏడాది ఆగస్టు 10 న చేసిన ఆరోపణలను వెరిఫై చేయడానికి ఫిర్యాదు దారులు ఏం చేశారో  లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ అడిగింది.