కోల్‌కతా అత్యాచార కేసులో కోర్టుకు CBI ఛార్జ్‌షీట్.. కీలక విషయాలు వెలుగులోకి

కోల్‌కతా అత్యాచార కేసులో కోర్టుకు CBI ఛార్జ్‌షీట్.. కీలక విషయాలు వెలుగులోకి

కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆగస్ట్ 9న ఈ ఘటన చోటుచేసుకుంది. సంజయ్ రాయ్ అనే పోలీస్ వాలెంటీర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతను సీబీఐ కస్టడీలో ఉన్నాడు. ప్రభుత్వం ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించింది. సీబీఐ కేసు దర్యాప్తు చేసి ఈ రోజు (అక్టోబర్ 7)న కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 

సీల్దాలో ఉన్న అద‌న‌పు చీఫ్ జుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ త‌న నివేదిక‌ను అందజేసింది. 200 మంది నుంచి స్టేట్ మెంట్ తీసుకొని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదికారులు ఛార్జ్ షీట్ ను తయారు చేశారు. ప్రస్తుతానికి బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆధారాలు లేవని.. దర్యాప్తులో తేలింది. సంజయ్ రాయ్ ఒక్కడే హాస్పిటల్ సెమినార్ హాల్ లో అత్యాచారం చేసి, హత్య చేశాడని పేర్కొంది. అయితే ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు. సామూహిక అత్యాచారం జరిగి ఉంటే.. కేసులో నిందితులను చేర్చుతామని అన్నారు.

ALSO READ | ED Raids: ఆప్ ఎంపీ సంజయ్ ఆరోరా ఇంట్లో ఈడీ సోదాలు

ఆగ‌స్టు 9వ తేదీన క్రైం జ‌రిగింది. హాస్పిట‌ల్ బ్రేక్ టైంలో సెమినార్ రూమ్‌లో నిద్రించేందుకు వెళ్లిన పీజీ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చార్జ్‌షీట్‌లో గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అని ప్రస్తావించలేదు. రాయ్ ఒక్కడే నేరానికి పాల్పడిన‌ట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ కేసులో ఇంకా విచార‌ణ కొన‌సాగుతున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.