థార్డ్ వేవ్ మొదలు కావడంతో.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను కేటాయించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్ లాంటి వాటికి ఇబ్బంది లేకుండా ప్రిపేర్ గా ఉన్నామని చెప్పారు. లాక్ డౌన్, ఆంక్షలకు సంబంధించి పూర్తి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయన్నారు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి.. ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. సంక్రాంతి తర్వాత ముఖ్య మంత్రులతో ప్రధాని చర్చించి నిర్ణయం తీసుకుంటారాని తెలిపారు కిషన్ రెడ్డి.