కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదని.. ఈ నేపథ్యంలో జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిఅడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అయితే ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పర్మిషన్లు ఉంటేనే కాళేశ్వర ప్రాజెక్టును హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. హైపవర్ కమిటీ అనుమతిస్తేనే జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదు. జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చే అర్హత దానికి లేదు. '' అని కేంద్ర జలశక్తి శాఖ సహాయకమంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు.