న్యూఢిల్లీ: లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)కి చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను టెర్రరిస్టు సంస్థగా కేంద్రం ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘టెర్రరిస్టు యాక్టివిటీస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు.. ఆన్‌లైన్ ద్వారా యువతను టీఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటున్నది. ఉగ్ర కార్యకలాపాలపై ప్రచారం చేస్తున్నది. టెర్రరిస్టులను నియమించుకుంటున్నది. పాక్ నుంచి టెర్రరిస్టులను మన దేశంలోకి పంపిస్తున్నది.
కాశ్మీర్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్నది. కాశ్మీరీలను ప్రేరేపించేందుకు సోషల్ మీడియాలో సైకలాజికల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నది” అని కేంద్ర హోంశాఖ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది.