జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి సంబంధించి ముందడుగు పడింది. విలీనంపై కేంద్రం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీతో సహా 8 మంది సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ రిపోర్ట్ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనుంది. విలీనానికి మద్దతు తెలుపుతూ గతంలో కేంద్రానికి రాష్ట్ర సర్కార్ నివేదిక పంపింది. నెల రోజుల్లో పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించనుంది.
కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంత్రి కేటీఆర్ పలుసార్లు కేంద్రాన్ని కోరారు. కంటోన్మెంట్ తో నగర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రానికి విన్నవించారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనంపై కసరత్తు మొదలుపెట్టింది. కేంద్రం నిర్ణయంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.