కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

హైదరాబాద్, వెలుగురాష్ర్టంలో కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను రాష్ర్ట సర్కార్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. కేంద్రం రూ.256 కోట్లను ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం రూ.164 .41 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. సమాచార హక్కు చట్టం కింద జలగం సుధీర్ అనే వ్యక్తి అడిగిన వివరాలను సర్కారు వెల్లడించింది. జూన్ నాటికే కేంద్రం రూ.215 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఖర్చు చేసిన రూ.164 కోట్లలో.. రూ.67.23 కోట్లు మందులకు, రూ.30.68 కోట్ల సర్జికల్ ఐటమ్స్‌‌ కు, సివిల్ వర్క్స్‌‌ కోసం రూ.23.49 కోట్లు, ఎక్విప్‌‌మెంట్ కోసం రూ.42.99 కోట్లు ఉపయోగించినట్లు పేర్కొంది. ఇవన్నీ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌‌ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌ ద్వారా ఖర్చు చేసినట్లు తెలిపింది. ఫండ్స్ ను ఇప్పటికీ పూర్తి  ఖర్చు చేయకున్నా.. తెలంగాణకు మరో రూ.75 కోట్లు ఇవ్వనున్నట్టు పార్లమెంటులో కేంద్ర సర్కార్ వెల్లడించడం గమనార్హం.

రాష్ర్టంలో కరోనా నివారణకు ప్రజలు, కార్పొరేట్ కంపెనీల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. ఒక్క టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీకే రూ.18.26 కోట్ల విరాళాలు వచ్చినట్టు ఆఫీసర్లు చెప్పారు. భారీగా వెంటిలేటర్లు‌‌‌‌, టెస్టింగ్ కిట్లనూ కేంద్ర సర్కారు అందించింది. రాష్ర్టానికి 1,400 వెంటిలేటర్లను ఇచ్చింది.  వీటి ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌ను ఆరోగ్య శాఖ ఇంకా పూర్తి చేయలేదు. తెలంగాణకు 3,23,207 ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్లను కేంద్రం పంపింది. శాంపిల్స్‌‌‌‌ నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌ఏ ఎక్స్‌‌‌‌ట్రాక్షన్‌‌‌‌ చేయడానికి రూ.84.37 లక్షల విలువైన యంత్రాలు అందజేసింది. 13.85 లక్షల మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42.5 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.

మెషీన్ల రిపేర్లు చేపిస్తలె

కరోనా బారిన పడిన చాలా మందిలో లం గ్స్‌‌‌‌ పాడవుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. దీంతో లంగ్స్‌‌‌‌ ఏ మేరకు పాడైపోయాయో తెలుసుకోవడానికి సీటీ స్కాన్ చేయించాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ మన ప్రభుత్వ దవాఖాన్లలో సీటీ స్కాన్, ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ యంత్రాలు సరిగా పనిచేయట్లేదు. చుట్టుపక్కల ఏడెనిమిది జిల్లాలకు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ పెద్దదిక్కుగా ఉంది. ఇక్కడ రెండేళ్లుగా సీటీ స్కానర్ పని చేయట్లేదు. ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లా హాస్పిటళ్లలోనూ సీటీ స్కాన్ యంత్రాలు మూలకే ఉంటున్నాయి. కేంద్రం నిధులున్నా యంత్రాలను రిపేర్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక అక్కడి ఏరియా హాస్పిటళ్లను జిల్లా హాస్పిటల్స్‌‌‌‌గా పేరు మార్చారు. కానీ జిల్లా హాస్పిటల్స్‌‌‌‌ లో ఉండాల్సిన సౌకర్యాల్లేవు.  ఇప్పటికీ చాలా జిల్లాల్లో సీటీ స్కాన్ మిషన్లు లేవు. ప్రభుత్వ దవాఖాన్లను బలోపేతం చేయాలని కేంద్రానికి సూచించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. రాష్ర్టంలోని దవాఖాన్లపై కూడా దృష్టి పెట్టాలని డాక్టర్లు కోరుతున్నారు.