ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్రం. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటివరకు 14 విమానాల్లో భారతీయులు, పౌరులను తరలించారు. ఇవాళ ఐదు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఉదయం ఇస్తాంబుల్ నుంచి 220 మంది ఢిల్లీకి వచ్చారు. ఎయిర్ పోర్టులో విద్యార్థులకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు. పోలాండ్ నుంచి 2 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి భారతీయులు వచ్చారు. పోలాండ్ నుంచి ఫ్లైట్ లో వచ్చిన విద్యార్థులకు.... ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఉక్రెయిన్ లోని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా...ఎప్పటికప్పుడు కేంద్రమంత్రులు అక్కడున్న భారతీయ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈనెల 8 వరకు మొత్తం 50 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తుంది కేంద్రం. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలు పంపుతుంది. బుడాపెస్ట్ కు 10, బుకారెస్టుకు 29, పోలాండ్ కు 10 ప్రత్యేక విమానాలు నడపనుంది కేంద్రం. ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 సీ- 17 విమానాలు రోమేనియా, హంగేరీలకు వెళ్లాయి. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ లోని హిందాన్ ఎయిర్ బేస్ నుంచి 2 ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ బయల్దేరి వెళ్లినట్లు తెలిపారు అధికారులు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం నిత్యావసర సరకులు, దుప్పట్లు, మెడిసిన్ తీసుకొని వెళ్లింది సీ-17 విమానం.
మరిన్ని వార్తల కోసం