నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్లుగా హుస్సేన్, రామచందర్

  • ఉత్తర్వులు రిలీజ్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు చెందిన జాతోతు హుస్సేన్ ను నేషనల్ ఎస్టీ కమి షన్ (ఎన్సీఎస్టీ) మెంబర్ గా, వడ్డెపల్లి రామ చందర్ ను నేషనల్ ఎస్సీ కమిషన్ (ఎన్సీఎస్సీ) మెంబర్ గా కేంద్రం నియమించింది. శనివారం ఈ మేరకు కేంద్ర గిరిజన, సామాజిక న్యాయ శాఖలు ఉత్తర్వులు రిలీజ్ చేశాయి.

ఈ నియామక పత్రాలపై రాష్ట్రపతి సంతకాలు చేశారని, త్వరగా ఆయా కమిషన్ మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించాలని ఈ మేరకు కేంద్రం వీరిద్దరికి లేఖలు రాసింది. కాగా, జాతోతు హుస్సేన్ మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం, వడ్డపల్లి రామచందర్ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మండలానికి చెందినవారు.