![సింగరేని సీఎండీగా శ్రీధర్ కొనసాగింపునకు కేంద్రం నో](https://static.v6velugu.com/uploads/2020/12/sridhar.jpg)
జనరల్ బాడీ మీటింగ్ లో రిజల్యూషన్ ను వ్యతిరేకించిన
కోల్ మినిస్ట్రీ ప్రతినిధి ఆర్డినరీ తీర్మానంగా మార్చి పాస్ చేయించుకున్న రాష్ట్ర సర్కారు
రూల్స్ ప్రకారం ఇది చెల్లదంటున్న ఎక్స్పర్స్ట్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి సీఎండీగా ఐఏఎస్ ఆఫీసర్ ఎన్.శ్రీధర్‌ను కంటిన్యూ చేసేందుకు కేంద్రం నో చెప్పింది. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో బుధవారం జరిగిన యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఇందుకు వేదికైంది. ఇప్పటికే సీఎండీగా ఆరేండ్లు పూర్తి చేసుకున్న శ్రీధర్‌ను మళ్లీ కొనసాగించేందుకు పెట్టిన తీర్మానాన్ని సెంట్రల్ కోల్మినిస్ట్రీ ప్రతినిధి ఆల్క శేఖర్ వ్యతిరేకించారు. అయితే అదే టైంలో స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ రిజల్యూషన్‌ను ఆర్డినరీ తీర్మానంగా మార్చి.. కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, కంపెనీ సెక్రటరీ, స్టేట్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్ ఐలయ్య సాయంతో పాస్ చేయించుకుంది.కానీ ఈ తీర్మానం చెల్లదని సీఎండీ పదవి నుంచి శ్రీధర్దిగిపోవాల్సిందేనని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు.
రెండు గంటలకుపైగా జనరల్‌బాడీ మీటింగ్
సింగరేణి కాలరీస్ కంపెనీ యాన్యువల్జనరల్బాడీ మీటింగ్దాదాపు రెండు గంటలకుపైగా సాగింది. ఇందులో కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, స్టేట్ఎనర్జీ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్ ఐలయ్య, సెంట్రల్ కోల్మినిస్ట్రీ నుంచి ఆల్క శేఖర్‌తోపాటు కంపెనీ సెక్రటరీ పాల్గొన్నారు. 2019–20 ఫైనాన్షియల్ఇయర్కు సంబంధించిన ఈ యాన్యువల్ జనరల్‌బాడీ మీటింగ్‌లో.. తొమ్మిది తీర్మానాలకుగాను ఎనిమిది ఆమోదం పొందగా, సీఎండీ జీతభత్యాలు, ఇతర అలవెన్సులకు సంబంధించిన తీర్మానాన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది. స్టేట్, సెంట్రల్లకు చెల్లించే డివిడెండ్, సెస్, ఇతర ఫైనాన్షియల్ అంశాలపైనా చర్చించాక.. సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రతినిధిగా కోల్ మినిస్ట్రీ నుంచి హాజరైన ఆల్క శేఖర్ దానిని వ్యతిరేకించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ స్పెషల్ రిజల్యూషన్‌ను ఆర్డినరీ తీర్మానంగా మార్చి.. కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, కంపెనీ సెక్రటరీ, స్టేట్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్ ఐలయ్య సాయంతో పాస్చేయించుకుంది. వాస్తవానికి తీర్మానానికి అనుకూలంగా 70 శాతం ఓట్లు పడాలి. సింగరేణిలో సెంట్రల్వాటా 49 శాతం కావడంతో.. కోల్మినిస్ట్రీ ప్రతినిధికి అంతే శాతం ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి తీర్మానం వీగినట్టేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ ప్రకారం సీఎండీని కొనసాగించాలంటే.. కోల్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోవాలని గుర్తు చేస్తున్నారు. స్పెషల్ రిజల్యూషన్‌ను ఆర్డినరీ తీర్మానంగా మార్చాలన్నా.. 14 రోజుల ముందే కోల్ మినిస్ట్రీ ఆమోదం తప్పనిసరని.. ఇలా ఏరకంగా చూసినా సీఎండీ శ్రీధర్పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్తున్నారు.
సింగరేణి చరిత్రలోనే ఫస్ట్ టైం
సీఎండీ కొనసాగింపుపై రాష్ట్రం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కోల్మినిస్ట్రీ వ్యతిరేకించడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటి సారని అధికారవర్గాలు చెప్తున్నాయి. 2015 జనవరి 1న బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ పదవీకాలం నిజానికి 2016 డిసెంబర్ 31నే ముగిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా ఆరేండ్లుగా కొనసాగిస్తూ వస్తోంది. అధికారులెవరైనా రూల్స్ ప్రకారం ఐదేండ్లకు మించి ఈ పదవిలో ఉండరాదు. అయినా మరోసారి శ్రీధర్ పదవిని పొడిగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తోంది. సీఎండీ శ్రీధర్ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వస్తున్నాయి. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి 11 వేల కోట్లకుపైగా రావాల్సి ఉన్నా.. రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తేవకపోవడం, డీఎంఎఫ్టీ పేరిట సుమారు రూ.2 వేల కోట్లకుపైగా ఫండ్స్‌ను రాష్ట్ర ఖజనాకు మళ్లించడం, కంపెనీలో డీజిల్, ఓబీ కుంభకోణాలు, ఇతర అవినీతి, అక్రమాలు బయటపడ్తుండటంతో శ్రీధర్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కంపెనీ సెక్రటరీగా పనిచేసిన ఆఫీసర్.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల ఆప్మెల్కు ట్రాన్స్ఫర్ చేయడం వివాదాస్పదమైంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాటలకు కూడా సీఎండీ శ్రీధర్ విలువ ఇవ్వడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో శ్రీధర్‌పై కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది.