- దీనిపై లా కమిషన్ అధ్యయనం చేస్తోందని కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: లోక్సభకు, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం లా కమిషన్ అధ్యయనం చేస్తోందని కేంద్రం తెలిపింది. రోడ్ మ్యాప్.. విధాన రూపకల్పనపై పరిశీలిస్తోందని గురువారం రాజ్య సభలో ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు రాతపూర్వక సమాధానమిచ్చారు. లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై.. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన జరిపిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సహా భాగస్వామ్య పక్షాలందరితో సంప్రదింపులు జరిపామన్నారు. ఒకేసారి ఎన్నికలపై స్థాయి సంఘం 79వ నివేదికలో పలు సిఫార్సులు చేసిందని ఆయన చెప్పారు.