సమగ్ర శిక్ష స్కీమ్​కు రూ.1,698 కోట్లు.. రాష్ట్రానికి ఇవ్వనున్న కేంద్రం

సమగ్ర శిక్ష స్కీమ్​కు రూ.1,698 కోట్లు.. రాష్ట్రానికి ఇవ్వనున్న కేంద్రం

హైదరాబాద్, వెలుగు:  సమగ్ర శిక్ష స్కీమ్ కింద 2025–26 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,698 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. రెండ్రోజుల కింద ఢిల్లీలో జరిగిన సమగ్ర శిక్ష పీఏబీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. 2024–25 విద్యాసంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం రూ.1,930 కోట్లు ఇచ్చింది. అయితే, గతంతో పోలిస్తే నిధులన్నీ సక్రమంగా ఖర్చు చేసినా.. రాష్ట్రానికి సుమారు రూ.230 కోట్లు కోత పెట్టింది. 

దీంతో శుక్రవారం జరిగిన మీటింగ్​కు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి అటెండ్ అయి.. నిధులను పెంచాలని కోరారు. బడుల్లో ఏఐ టూల్స్ ద్వారా పిల్లల్లో చదువు సామర్థ్యాలను పెంచే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రానికి వివరించారు. కనీసం మరో రూ.300 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా, కేంద్ర అధికారులు నిధులు పెంచేందుకు ససేమిరా అన్నట్టు తెలిసింది.