
- మయన్మార్ కార్మికుడు మృతి
- మరొకరికి సీరియస్..ఏడుగురికి గాయాలు
మునిపల్లి(కోహీర్), వెలుగు : సంగారెడ్డి జిల్లా కోహీర్మండల కేంద్రంలోని ఓ చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగానే స్లాబ్ సెంట్రింగ్ కూలి ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. మయన్మార్ కు చెందిన ఖాసిం అలీ (20), నేపాల్ కు చెందిన రాజు, కోల్‌కతాకు చెందిన కార్మికులు కొంతకాలంగా కోహీర్ లో ఉంటూ లాలాకుంటలో మెథడిస్ట్చర్చినిర్మాణ పనులు చేస్తున్నారు. ఆదివారం స్లాబ్పనులు చేస్తుండగా కింది భాగంలో చెక్కలు కూలడంతో అందరూ కిందపడ్డారు. దీంతో ఖాసిం అలీ, రాజు తీవ్రంగా గాయపడగా..
కోల్‌కతాకు చెందిన మోహన్‌సింగ్, అహ్మద్, క్రిష్ణానంద్, అబ్దుల్‌రహీం, తాజుల్షేక్, దలీం షా, షేక్ ఆదిల్అహ్మద్లకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఖాసీం అలీ, రాజులను సంగారెడ్డి గవర్నమెంట్హాస్పిటల్కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఖాసిం అలీ చనిపోయాడు. రాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారు కోహీర్ గవర్నమెంట్హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జహీరాబాద్ డీఎస్పీ రఘు, సీఐ రాజు పరిశీలించారు.