అధికారుల చర్యలు అభినందనీయం

కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనాపై నెలకొన్న పరిస్థితులపై సమీక్ష చేశామని.. ఇంకా తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించామన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలన్న ఆయన.. ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఇటలీలో పరిస్థితికి నిర్లక్షమే కారణమని చెప్పారు. తెలంగాణలో 33 మందికి పాజిటివ్ వచ్చిందని.. వరంగల్ లో ఒక్క పాజిటివ్ కేసు లేదన్నారు. గ్రామాలను ప్రజలు నిర్బంధించుకోవడం శుభపరిణామం, వారికి ధన్యవాదాలు తెలిపారు.

క్వారంటైన్ లో ఉండని వారి సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాలని.. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కమిటీలు వేశామని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది మీ ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని జనం గుంపులు, గుంపులుగా తిరగొద్దన్నారు.నిత్యావసరాల ధరలు పెంచితే చర్యలు తప్పవని.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని తెలిపారు మంత్రి. భూపాలపల్లి జిల్లాలో 34 మంది అనుమానితులు ఉన్నారని.. మహబూబాబాద్ లో  101 మంది విదేశాల నుంచి వచ్చారు కానీ ఎవరికీ పాజిటివ్ రాలేదన్నారు. సరిహద్దులు మూసివేశామని అధికారుల చర్యలు అభినందనీయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి.