![వైఎస్సార్ తెలంగాణ పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం](https://static.v6velugu.com/uploads/2023/10/the-central-election-commission-has-allotted-binocular-symbol-to-ysr-telangana-party-in-the-assembly-elections_Ja5epyLdH4.jpg)
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి చర్చలు జరిగినప్పటికీ.. కాంగ్రెస్ వైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్ షర్మిల ప్రకటించారు.