ధర్మ సమాజ్ పార్టీకి టార్చిలైట్ గుర్తు..

హైదరాబాద్, వెలుగు : విశారదన్‌‌‌‌ అధ్యక్షుడిగా ఉన్న ధర్మ సమాజ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తు కోసం రాష్ట్రం నుంచి ధర్మ సమాజ్ పార్టీ దరఖాస్తు చేసుకుంది.

ఇందులో భాగంగా టార్చిలైట్ గుర్తును ఈసీ కేటాయించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు విశారదన్ మాట్లాడుతూ, 119 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేయనుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల నేతలు బరిలో ఉంటారని చెప్పారు.