యాప్ డిజైన్ చేయండి..కోటి సొంతం చేసుకోండి : కేంద్రం బంపర్ ఆఫర్

యాప్ డిజైన్ చేయండి..కోటి సొంతం చేసుకోండి : కేంద్రం బంపర్ ఆఫర్

ఇండియన్ టెక్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆపర్ ప్రకటించింది. జూమ్ యాప్ కు పోటీగా వీడియా కాన్ఫరెన్సింగ్ యాప్ ను డెవలప్ చేసిన కంపెనీకి రూ.కోటి ఆఫర్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున వర్క్ ఫ్రమ్ హోం, ఆన్ లైన్ క్లాస్ లు, మీటింగ్ లు, వీడియో కాన్ఫరెన్స్ ల  యాప్ లకు డిమాండ్ పెరిగింది. అయితే వీటి వాడకంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. మీటింగ్ ల కోసం వాడే జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ కు సురక్షితం కాదని ఇటీవల హోం మంత్రిత్వ శాఖ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ (సైకార్డ్) హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే . అంతకుముందు ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సైతం జూమ్  యాప్ వల్ల  సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పింది.

ఈ నేపథ్యంలో  వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా వర్క్ ఫ్రమ్ హోం ను సులభతరం చేసేందుకు కేంద్రం ఇన్నేవేషన్ ఛాలెంజ్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 రిజిస్ట్రేషన్లు

ఈ చాలెంజ్ లో భాగంగా జూమ్ యాప్ కు పోటీగా వీడియా కాన్ఫరెన్సింగ్ యాప్ ను తయారు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం టెక్ కంపెనీలను ఆహ్వానించింది. యాప్ డిజైన్ లో భాగంగా ఆయా కంపెనీలు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకోవాలి.

వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఎలా ఉండాలంటే  

ఈ యాప్ ను డిజైన్ చేసే కంపెనీలకు కేంద్రం కొన్ని షరతులు విధించింది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఏ ప్రాంతంలోనైనా, ఎలాంటి భాషలో అయినా వినియోగించుకునేలా, కరెంట్ వినియోగం తక్కువగా ఉండేలా డిజైన్ చేయాలని సూచించింది.

జులై 29న ఫలితాలు

ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో భాగంగా డిజైన్ చేసిన కంపెనీ ఫలితాలను జులై 29న కేంద్రం ప్రకటించనుంది. ఆ ఫలితాల్లో విజయం సాధించిన కంపెనీకి రూ.కోటి బహుమతితో పాటు  సమాచార సాంకేతిక మంత్రి  సర్టిఫికేట్ ను ప్రెజెంట్ చేయనుంది.