కేసీఆర్కు పేరొస్తుందని రాష్ట్రానికి నిధులిస్తలేరు

కేసీఆర్కు పేరొస్తుందని రాష్ట్రానికి నిధులిస్తలేరు
  • రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని దేశాయ్ పేట్ లో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం. బహిరంగ సభకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, స్పీకర్ పోచారం, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు. ముందుగా బాన్సువాడ మండలం కోయగుట్టలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు నేతలు. 
దేశాయిపేట్ గ్రామంలో 5వ విడుత పల్ల ప్రగతి కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులను విడుదల చేస్తలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు, దేశప్రజలే అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చే నిధులను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.