ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. జీనోమిక్ కన్సార్టియం ద్వారా వేరియంట్లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాలను మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. చైనా, జపాన్, యూఎస్, బ్రెజిల్ లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని కేంద్రం గుర్తు చేసింది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కర్ని పరీక్షించి..జీనోమ్ సీక్వెన్స్ ను అందించాలని ఆదేశించింది.
మరో వైపు రేపు హెల్త్ ఆఫీసర్స్‌తో మన్సుఖ్ మాండవీయ సమావేశం కానున్నారు. తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత రాష్ట్రాలకు మరిన్ని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.