
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని సత్యనారాయణ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. హైమామతి అనే మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు దుండగులు. ఉదయం హైమావతి ఇంటి నుంచి బయటికి వచ్చి పని చేస్తుండగా స్నాచర్లు ఆమె మెడ నుంచి గొలుసు లాక్కెళ్లారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారిని వెంబడించేందుకు యత్నించిన మహిళ కిందపడిపోయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చైన్ స్నాచింగ్ కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీకెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.