భారీగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ పట్టివేత.. 40టన్నుల బియ్యం, 11టన్నుల గోధుమలు

భారీగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ పట్టివేత.. 40టన్నుల బియ్యం, 11టన్నుల గోధుమలు

రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేస్తు్న్న రేషన్ బియ్యం, గోధుమలను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. మంగళవారం పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ శాఖ జాయింట్ ఆపరేషన్ లో అక్రమ రేషన్ స్థావరం గుట్టు రట్టైంది. భారీగా రేషన్ బియ్యం, గోధుమల నిల్వలు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ మరియు రవీందర్ నాయక్ తెలిపారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ మరియు రవీందర్ నాయక్ హెచ్చరించారు. నిరుపయోగంగా ఉన్న ఓ పశువుల కొట్టంలో  దాదాపు 40 టన్నుల రేషన్ బియ్యం, 11 టన్నుల గోధుమలు నిల్వ చేశారు. వాటిని స్వాధీనం చేసుకొని అక్రమార్కులపై కేసు నమోదు చేశారు. పీడిఎస్ బియ్యాన్ని సేకరించి పొరుగు జిల్లాలకు, రాష్ట్రాల కు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు అధికరులు.

ఈ దాడుల్లో పౌర సరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ బృందంతో పాటు డి టీ  రవీందర్ నాయక్ స్వాధీనం చేసుకున్న రేషన్ సరుకులను పంచనామ చేశారు. వాహనాలను మోకిల పోలీసుల అదుపులో ఉంచారు. సరకును చేవెళ్ళ పౌర సరఫరాల సంస్థ గిడ్డంగికి అప్పగించినట్లు మాచన రఘునందన్ రవీందర్ నాయక్ తెలిపారు.