కాంగ్రెస్ భిక్షతో సీఎం అయ్యావు.. తిన్నింటి వాసాలు లెక్కపెడతావా.. కేసీఆర్పై పీసీసీ చీఫ్ ఫైర్

కాంగ్రెస్ భిక్షతో సీఎం అయ్యావు.. తిన్నింటి వాసాలు లెక్కపెడతావా.. కేసీఆర్పై పీసీసీ చీఫ్ ఫైర్
  • సోనియా తెలంగాణ ఇవ్వకుంటే నువ్వు సీఎం అయ్యెవాడివా? 
  • డబ్బు కోసం దొంగ పాస్ పోర్టుల బిజినెస్ చేసిన చరిత్ర నీది
  • వేల కోట్ల ఆస్తులు కూడబెట్టి.. ఇవ్వాళ నకిలీ గాంధీలు అంటావా? 
  • కిషన్ రెడ్డితో కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నడని ఫైర్​ 
  • పదేండ్ల బీఆర్ఎస్ పాలన..15 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని సవాల్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలన.. కాంగ్రెస్ 15 నెలల పాలనపై చర్చకు సిద్ధమా? అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాజీ సీఎం కేసీఆర్​కు సవాల్ విసిరారు. ‘‘ప్లేస్, టైం మీరే నిర్ణయించండి.. ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధం”అని అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చే దమ్ము కేసీఆర్​కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. 

గాంధీ కుటుంబం పెట్టిన భిక్షతోనే దొంగ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుల బిజినెస్ నుంచి సీఎం అయ్యి.. లక్షల కోట్లకు పడగలెత్తి.. ఇప్పుడు అదే కుటుంబాన్ని నకిలీ గాంధీలు అంటావా? అని ఫైర్ అయ్యారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కేసీఆర్​కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని విమర్శించడం కేసీఆర్ దుస్సాహసానికి పరాకాష్ట, దీనికి తగిని మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ప్లాప్ అని.. ఆ సభలో జనాలకంటే విస్కీ బాటిళ్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. సభలో మహిళలే కనిపించలేదన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారని, అందుకే బీఆర్ఎస్ మీటింగ్ కు వారు రాలేదని అన్నారు. ఆ సభలో కేసీఆర్ ప్రసంగంలో ఏమాత్రం పసలేదని, తెలంగాణలో ఆయన శకం ముగిసిందన్నారు.

బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్

బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి సభలో బీజేపీపై కేసీఆర్​కేవలం రెండు నిమిషాలు మాత్రమే చేసిన విమర్శలే నిదర్శనమని మహేశ్​గౌడ్​ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కుట్ర పన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ములాఖత్ అయి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని కేసీఆర్ పై మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిందని, దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనని ఆయన ఆరోపించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధిని చూసి కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందన్నారు. కేటీఆర్, కవిత, హరీశ్ ఆడుతున్న మూడు ముక్కలాటలో కేసీఆర్ కు మతిభ్రమించిందని.. కుటుంబ కొట్లాటలు వేగలేక రజతోత్సవ సభ పేరిట కేసీఆర్ హంగామా చేసినా.. ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. వేదికపై అయ్య కేసీఆర్, కొడుకు కేటీఆర్ ఫొటోతో అల్లుడు హరీశ్, బిడ్డ కవిత మనస్సుకు మరోసారి గాయమైందని అన్నారు. ఉద్యమ జెండాను దింపితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన కేసీఆర్​కు గత పదేళ్లలో అమరుల త్యాగం, ఉద్యమకారులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. గజ్జ కట్టిన గద్దర్ ను అవమానించిన చరిత్ర కేసీఆర్ దేనని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోయిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు వరికుప్పల మీదనే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను ప్రజలు ఇంకా మరచిపోలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు రైజింగ్ అయితే.. తమ పాలనలో దళితులు, మహిళలు, యువత రైజింగ్ అని చెప్పారు. 

గాంధీ కుటుంబంపై మాట్లాడే స్థాయి కేసీఆర్​కు లేదు: షబ్బీర్​ అలీ

గాంధీ కుటుంబంపై మాట్లాడే స్థాయి కేసీఆర్ కు లేదని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. మహేశ్​ గౌడ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబానికి.. తాగుబోతుల కుటుంబంతో పోలికా అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చిన సోనియా చరిత్రలో నిలిచిపోతుందని మాట్లాడిన కేసీఆర్ మాటలు ఇప్పుడు ఎటు పోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ కు దమ్ముంటే పీసీసీ చీఫ్ చేసిన చాలెంజ్ ను స్వీకరించి, చర్చించేందుకు రావాలని కోరారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్, కాంగ్రెస్ కట్టిన డ్యాంలతోనే ఇప్పుడు తెలంగాణలో వరి ఎక్కువ పండుతోందని అన్నారు.