వరంగల్ ను రెండో రాజధాని చేసే లక్ష్యంగా సీఎం కార్యాచరణ ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. రేపు (జూన్ 27, 2024 ) వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందన్నారు. మధ్యాహ్నం 1కు టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుని పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన పై సీఎం పరిశీలస్తారని తెలిపారు. వరంగల్ లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సందర్శిస్తారని చెప్పారు.
హనుమకొండ కలెక్టరెట్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై సీఎం రివ్యూ చేస్తారని వెల్లడించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ అంశం చర్చకు వస్తాయని, గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సొంత ఎజెండాతో చేసిందని అర్థం అయ్యిందన్నారు. దాన్ని మార్చాల్సి ఉందని చెప్పారు. 3 నెలల కాలవ్యవధి పెట్టీ మాస్టర్ ప్లాన్ తయారీ చేస్తామని స్మార్ట్ సిటీ పనుల అంశం చర్చ ఉంటుందని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశం చర్చిస్తామని తెలిపారు మంత్రి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం,దాని సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తామని, మమూనూర్ ఎయిర్ పోర్ట్ అంశం కూడా చర్చకు వస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.