- బీబీపేటలో కనిష్టంగా 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో చలి మరింతగా పెరుగుతోంది. రోజురోజుకు ఆయా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. గురువారం పొద్దున జిల్లాలో బీబీపేటలో అతితక్కువగా 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాచారెడ్డి మండలం లచ్చాపేట, నిజాంసాగర్ మండలం ముగ్దాంపూర్లో 10.1 డిగ్రీలు
మద్నూర్ మండలం మేనూర్‌లో 10.2 డిగ్రీలు, గాంధారి మండలం సర్వాపూర్‌లో 10.4 డిగ్రీలు, జుక్కల్‌లో 10.5 డిగ్రీలు, దోమకొండలో 10.6 డిగ్రీలు, బిచ్కుంద మండలం పుల్కల్లో 11.1 డిగ్రీలు, బిచ్కుంద, నస్రుల్లాబాద్‌లో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.