ఫ్యామిలీకి ఒకే పోలింగ్ సెంటర్‌‌‌‌లో ఓటు : బి.గోపి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఒక ఇంట్లో ఉన్న ఓటర్లందరి పేర్లు  ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ బి. గోపి అధికారులను ఆదేశించారు.  శనివారం సిటీలోని రాంనగర్, భాగ్యనగర్‌‌‌‌, సంతోష్ నగర్, విద్యానగర్ ఏరియాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాలను కలెక్టర్​పరిశీలించారు. ఇంటి యజమానులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ నుంచి ఏఆర్వోలు, ఎంపీడీవోలతో ప్రత్యేక క్యాంపెయిన్ పై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

అనంతరం కరీంనగర్ కు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథిని కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్​, ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ రమేశ్‌‌ పాల్గొన్నారు. 

నైతిక బాధ్యతతో ఓటును వినియోగించుకోవాలి

జగిత్యాల టౌన్: ప్రజాస్వామ్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరుగా నమోదు చేసుకొని, నైతిక బాధ్యతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాష పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌‌లో వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు ప్రదర్శనలు, పద్య, పాట, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. కలెక్టర్​వెంట అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.