ఉన్నతి ప్రోగ్రామ్‌‌ను పట్టించుకోరా ? : కలెక్టర్‌‌ ప్రావీణ్య

  •     పర్వతగిరి జడ్పీహైస్కూల్‌‌ టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం
  •     రూల్స్‌‌ పాటించని వారికి షోకాజ్‌‌ నోటీసుల జారీకి ఆదేశం

పర్వతగిరి/వర్ధన్నపేట, వెలుగు : ‘ఉన్నతి’ ప్రోగ్రాంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వరంగల్‌‌ కలెక్టర్‌‌ ప్రావీణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌‌ జిల్లా పర్వతగిరి జడ్పీ హైస్కూల్‌‌, మోడల్‌‌ స్కూల్‌‌ను బుధవారం ఆమె తనిఖీ చేశారు. టీచర్ల అటెండెన్స్‌‌ రిజిస్టర్లు, క్లాస్‌‌ రూమ్స్‌‌ను పరిశీలించి టీచర్లు, స్టూడెంట్లతో మాట్లాడారు. స్టూడెంట్ల అటెండెన్స్‌‌ తక్కువ ఉండడానికి గల కారణాలను తెలుసుకున్నారు. జడ్పీహైస్కూల్‌‌లో 6 నుంచి 9వ తరగతి చదివే స్టూడెంట్ల ఉన్నతి ప్రోగ్రాంకు సంబంధించి సైన్స్, హిందీ, మ్యాథ్స్‌‌ సబ్జెక్టుల మార్కులు రిజిస్టర్‌‌లో ఎంటర్‌‌ చేయకపోవడంతో హెచ్‌‌ఎం రమేశ్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బేస్‌‌లైన్‌‌ టెస్ట్‌‌, ఎఫ్‌‌ఆర్‌‌ఎస్‌‌ అటెండెన్స్‌‌ నిర్వహణపై సరైన వివరణ ఇవ్వకపోవడం, రికార్డులను సమర్పించకపోవడంతో క్లాస్‌‌, టీచర్‌‌ వైజ్​కంప్లీట్‌‌ రిపోర్ట్‌‌తో గురువారం ఆఫీస్‌‌కు రావాలని ఆదేశించారు. పర్మిషన్‌‌ తీసుకోకుండా స్కూల్‌‌కు గైర్హాజర్‌‌ అయిన, ఎఫ్‌‌ఎల్‌‌ఎన్‌‌ ప్రోగ్రాంకు సంబంధించి బేస్‌‌లైన్‌‌ రికార్డులను పొందుపరచని మోడల్‌‌ స్కూల్‌‌ ప్రిన్సిపాల్‌‌ శ్రీదేవికి షోకాజ్‌‌ నోటీసు జారీ చేయాలని డీఈవో వాసంతిని ఆదేశించారు. ఎఫ్ఎల్‌‌ఎన్‌‌ అమలులో కాంప్లెక్స్‌‌ హెచ్‌‌ఎంల పాత్ర కీలకం అన్నారు. ఉన్నతి ప్రోగ్రాం అమలులో పూర్తి బాధ్యత హెచ్‌‌ఎంలదేనని చెప్పారు.

టెన్త్‌‌ స్టూడెంట్లకు రోజు వారీగా స్పెషల్ క్లాసులు, ప్రాక్టీస్‌‌ టెస్ట్‌‌లు నిర్వహించాలని ఆదేశించారు. పర్వతగిరి మోడల్‌‌ స్కూల్‌‌లో ఆవరణలో చెత్త, చెదారం పేరుకుపోవడంతో ఇన్‌‌చార్జి ప్రిన్సిపాల్ గణేశ్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెత్తను ఎందుకు తొలగించడం లేదు, జీపీ ట్రాక్టర్‌‌ రావడం లేదా’ అని ప్రశ్నంచారు. శానిటేషన్‌‌ సిబ్బందిని తొలగించాలని డీఈవోను ఆదేశించారు.

కార్యక్రమంలో డీఈవో వాసంతి, తహసీల్దార్‌‌ వెంకటస్వామి, ఎంపీడీవో సంతోష్‌‌కుమార్‌‌, ఎంఈవో రంగయ్య పాల్గొన్నారు. అనంతరం వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి జడ్పీహైస్కూల్, ఎంపీపీఎస్‌‌ను తనిఖీ చేశారు. బేస్‌‌లైన్‌‌ రికార్డులు మెయింటేన్‌‌ చేయని, పర్మిషన్‌‌ లేకుండా గైర్హాజరైన హెచ్‌‌ఎంకు, సరైన బోధనా పద్ధతులు పాటించని టీచర్లకు షోకాజు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.