భద్రాద్రికొత్తగూడెం జిల్లా: వారం రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు రాక తీవ్రంగా ఇబ్బందిపడుతున్న గ్రామస్తులు జిల్లా కలెక్టర్ పర్యటనను అడ్డుకున్నారు. తమ సమస్య పరిష్కరించిన తర్వాతే వెళ్లాలంటూ.. వారు కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో చోటు చేసుకుందీ ఘటన.
సింగభూపాలెం గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ వస్తున్న విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీ మహిళలు కలెక్టర్ కాన్వాయ్ గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే రోడ్డుపైకి వచ్చి కలెక్టర్ అనుదీప్ వాహనాన్ని ఆపేశారు. మహిళలు, పురుషులు, పిల్లలు ఒక్కసారిగా తరలిరావడం గమనించిన కలెక్టర్ తన వాహనం దిగిన ఏమైందంటూ ప్రశ్నించగా గ్రామంలో తాగునీరు రావడంలేదని ఫిర్యాదు చేశారు.
వారం రోజులుగా మిషన్ భగీరథనీరు రావడంలేదని.. మరోవైపు గ్రామంలో ఉన్న చేతి పంపులు కూడా పనిచేయడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చుక్కనీటి కోసం పరితపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇంత పరిస్థితి వచ్చే వరకు ఎలా ఉన్నారంటూ అనునయించే ప్రయత్నం చేసిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడారు. కారణాలేంటని ఆరా తీస్తూ.. తక్షణమే తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.
ఇవి కూడా చదవండి
6న ఇంటర్ గురుకుల ప్రవేశ పరీక్ష