వరంగల్ కార్పొరేషన్‍లో కార్పొరేటర్ల రచ్చ

వరంగల్ కార్పొరేషన్‍లో కార్పొరేటర్ల రచ్చ
  •     గందరగోళం నడుమ బడ్జెట్‍ ఆమోదం
  •     మేయర్‍ సుధారాణిని టార్గెట్‍ చేసిన బీఆర్‍ఎస్‍, బీజేపీ కార్పొరేటర్లు
  •     బడ్జెట్‍ పత్రాలను చించివేసిన బీఆర్‍ఎస్‍ కార్పొరేటర్లు
  •     మేయర్‍ పోడియం వద్ద బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ పోటాపోటీ నినాదాలు

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ వార్షిక అంచనా బడ్జెట్‍కు గురువారం నిరసనలు, నినాదాలు, తోపులాట మధ్య కౌన్సిల్‍ ఆమోదం పొందింది. 2024–25 సంవత్సరానికి రూ.650 కోట్ల 12 లక్షల ముసాయిదా బడ్జెట్‍ అంచనాలను మేయర్‍ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం ప్రవేశ పెట్టింది. బడ్జెట్‍పై మేయర్‍ ప్రసంగిస్తుండగానే బీఆర్‍ఎస్‍  కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి బడ్జెట్‍ పేపర్లు చింపారు. ఇది  జరుగుతుండగానే మేయర్​ బడ్జెట్‍ ఆమోదం పొందినట్లు ప్రకటించి మీటింగ్​ను వాయిదా వేశారు.

 కౌన్సిల్‍ మీటింగులో బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి పాల్గొనగా..కాంగ్రెస్‍ నుంచి ఎమ్మెల్యేలు నాయిని రాజేం దర్‍రెడ్డి, కేఆర్‍. నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, హనుమకొండ కలెక్టర్‍ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమి షనర్‍ అశ్విని తానాజీ వాఖడే, అడిషనల్‍ కలెక్టర్‍ రాధి క గుప్తా, డిప్యూటీ మేయర్‍ రిజ్వానా షమీం పాల్గొన్నారు. 

గ్రేటర్‍లో ఖర్చు ఎంత? నిధులెట్లా? 

వరంగల్‍ బల్దియాలో జనాలు కట్టే పన్నుల ద్వారా రూ.237 కోట్ల 2 లక్షలు వస్తాయని భావిస్తే..ఇందులో ఉద్యోగుల జీతాలకు రూ.80 కోట్లు, శానిటేషన్‍ కు రూ.25 కోట్ల 80 లక్షలు, కరెంట్‍ బిల్లులకు రూ.18 కోట్ల 45 లక్షలు,  గ్రీన్‍ బడ్జెట్‍కు  రూ.23 కోట్ల 70 లక్షలు.. ఇంజినీరింగ్‍ విభాగానికి రూ.25 కోట్ల 75 లక్షలు, సాధారణ నిర్వహణకు రూ.18 కోట్ల 50 లక్షలు, టౌన్‍ ప్లానింగ్​కు రూ.కోటి 20 లక్షలు, డిజాస్టర్‍ రెస్పాన్స్ ​కోసం రూ.కోటి 50 లక్షలు కేటాయించారు. 

విలీన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వాటర్‍ సప్లై కోసం రూ.14 కోట్ల 4 లక్షలు అంచనా వేయగా.. గ్రేటర్‍ పరిధిలో ప్రజలకు అవసరమైన పార్కుల అభి వృద్ధి, వైకుంఠ ధామాలు, మార్కెట్లు, డంపింగ్‍ యా ర్డు, ఓపెన్‍ జిమ్‍ కోసం రూ.5 కోట్ల 20 లక్షలు.. బల్ది యా పరిధిలోని 66 డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీల వంటి నిర్మాణాల కోసం రూ.22 కోట్ల 88 లక్షలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 

ఇక రూ.410 కోట్ల 10 లక్షల గ్రాంట్లు వస్తాయని అంచనా వేస్తున్న క్రమంలో.. నాన్‍ ప్లాన్‍ గ్రాంట్లు (15వ ఫైనాన్స్​కమిషన్‍, పట్టణ ప్రగతి) ద్వారా రూ.310 కోట్లు.. ప్లాన్‍ గ్రాంట్లు (ఎస్సీ సబ్‍ప్లాన్‍, టీఎస్‍పీ, ఎస్‍బీఎం, సీఎం అష్యూరెన్స్​ అండ్‍ మైనార్టీ) ద్వారా రూ.77 కోట్లు, ఇతర గ్రాంట్ల(సీడీపీ, ఎస్‍డీఎఫ్‍ అండ్‍ ఎంపీ ల్యాడ్స్) ద్వారా రూ.23 కోట్ల 10 లక్షలతో కలిసి వస్తాయని బడ్జెట్‍ రూపొందించారు.   

మేయర్‍ పోడియం వద్ద..హంగామా

బడ్జెట్‍ సమావేశం నేపథ్యంలో..విపక్ష బీఆర్‍ఎస్‍, బీజేపీతో పాటు కాంగ్రెస్‍లోని ఓ వర్గం రెండు రోజులు మీటింగులు పెట్టుకుని అవిశ్వాసం పెట్టాలనుకుంది. సుధారాణి పార్టీ మారినందున ఆమెకు బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో గురువారం బడ్జెట్‍ మీటింగ్‍ సందర్భంగా గొడవ జరిగే అవకాశాలున్నాయనే సంకేతంతో వరంగల్‍ ఏసీపీ నందిరాం నాయక్‍ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కార్పొరేషన్‍ మెయిన్‍ బిల్డింగ్‍, చుట్టూ ఉన్న ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. 

పాలకవర్గం ఉదయం 11 గంటల ప్రాంతంలో కౌన్సిల్‍ సమావేశానికి చేరుకోగా.. బీఆర్‍ఎస్‍, బీజేపీ కార్పొరేటర్లు ‘పార్టీ మారిన మేయర్‍ సుధారాణి సభ్యత్వం రద్దు చేయాలి’  ‘రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్‍ తొలగించొద్దు’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నల్ల బ్యాడ్జీలు ధరించి హాల్‍లోకి వచ్చారు. మేయర్‍ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే ప్లకార్డులతో  నిరసన తెలిపారు. మేయర్‍ పోడియం ముందు మేయర్‍ డౌన్‍ డౌన్‍ అంటూ బీఆర్‍ఎస్‍.. కాంగ్రెస్‍ జిందాబాద్‍ అంటూ అధికార పార్టీ కార్పొరేటర్లు పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో కౌన్సిల్‍ హాల్‍ దద్దరిలిల్లింది. 

బీఆర్‍ఎస్‍ కార్పొరేటర్లు ఓ అడుగు ముందుకేసీ మేయర్‍ సుధారాణి పోడియం వెనక భాగం నుంచి పైకెళ్లారు. అధికారుల వద్దనున్న బడ్జెట్‍ పత్రాలను గుంజుకుని చింపిపారేశారు. దీంతో ఒక్కసారిగా వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి.  మేయర్‍ మైక్‍  తీసుకుని బడ్జెట్‍కు పాలకవర్గం తీర్మానం తెలిపిందని చెబుతూ సమావేశాన్ని వాయిదా వేసి అక్కడినుంచి దిగిపోయారు. అయినా, బీఆర్‍ఎస్‍, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని బయటకు తీసుకువచ్చారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్పొరేషన్‍ బిల్డింగ్‍ ముందు కాసేపు నిరసన తెలిపిన విపక్షాలు వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్రు

మేము వాస్తవిక బడ్జెట్‍ను ప్రవేశపెట్టి ఆమోదించినం. బీఆర్‍ఎస్‍ కార్పొరేటర్లకు తమ డివిజన్లలో అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే బిల్లుకు సపోర్ట్​ చేయాల్సి ఉండే. అలాకాకుండా పార్లమెంట్‍లో తెలంగాణ బిల్లును వ్యతిరేకవాదులు చించివేసినట్లు బీఆర్‍ఎస్‍ లీడర్లు బల్దియా బడ్జెట్‍ పేపర్లను చింపివేశారు. వారికి ఏంకావాలో వారికే తెలియదు. వరంగల్‍ సిటీ ముంపునకు గురికాకుండా టీయూఎఫ్​ఐడీసీ కింద సీఎం రేవంత్‍రెడ్డి రూ.250 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నా.        
మేయర్‍ సుధారాణి

మేయర్​ను టార్గెట్‍ చేసిన్రు 

వరంగల్​లో ఎన్నో సమస్యలున్నయ్‍. చేయాల్సిన అభివృద్ధి పనులున్నయ్‍. బీఆర్‍ఎస్‍, బీజేపీ కార్పొరేటర్లు వాటిమీద మాట్లాడకుండా మేయర్‍ను తొలగించాలని మాట్లాడటం సిగ్గుచేటు. బీజేపీ, బీఆర్‍ఎస్‍ రెండూ ఒక్కటే. అందుకే ఒక్కటై రాజకీయం చేస్తున్రు. బీఆర్‍ఎస్‍ నేతల తీరువల్లే వరంగల్‍ అభివృద్ధి 20 ఏండ్లు వెనక్కి పోయింది. వారు ప్రజాసమస్యలు పట్టించుకుని ఉంటే సిటీ మునిగేది కాదు. రాజముద్రలో కాకతీయ తోరణాన్ని తొలగిస్తున్నట్లు మేమెక్కడా చెప్పకున్నా రాద్ధాంతం చేస్తున్న బీఆర్‍ఎస్‍ నేతలు..ముందు పదేండ్ల కాకతీయ ఉత్సవాలు ఎందుకు చేయలేదో చెప్పాలే . 

ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, 
 

సమస్యలు చెప్తే మేయర్‍ వినట్లే 

సుధారాణి బీఆర్‍ఎస్‍ లో ఉన్న టైంలో...ఇప్పుడు కాంగ్రెస్‍లో చేరాక సమస్యలు చెబితే పట్టించుకోవట్లే. కార్పొరేటర్లు టైం అడిగినా ఇవ్వట్లే. బడ్జెట్‍ మీటింగ్‍ కంటే ముందు డివిజన్‍ సమస్యలను తెలుసుకోడానికి కార్పొరేటర్లతో జనరల్‍ బాడీ మీటింగ్‍ పెట్టాలని కోరినం. కానీ వినిపించుకోలే. అందుకే వ్యతిరేకిస్తున్నం.

  చాడ స్వాతిరెడ్డి (బీజేపీ కార్పొరేటర్)