భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలోని ప్రతి క్వార్టర్ వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని కంపెనీ డైరెక్టర్ ఎన్. బలరాం తెలిపారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్లో డిజిటలైజేషన్ ప్రక్రియకు డైరెక్టర్ సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న మొత్తం క్వార్టర్ల వివరాలను పొందుపరుస్తున్నామన్నారు. ఒక్కో ఉద్యోగి పేర ఎన్ని క్వార్టర్లు ఉన్నాయో తెలుస్తోందన్నారు.
మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తులు, సీనియార్టీ వివరాలను ఎస్ఏపీలో డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. ప్రోగ్రాంలో జీఎం పర్సనల్ బసవయ్య, అధికారులు హరప్రసాద్, వేణు, గట్టు స్వామి, సుశీల్, అనిల్, ప్రవీణ్, శివ కుమార్ పాల్గొన్నారు.