ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్లకు తగ్గుతున్న కాంపిటీషన్ ఒక్కో సీటుకు కేవలం ఐదుగురే పోటీ!

ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్లకు తగ్గుతున్న కాంపిటీషన్ ఒక్కో సీటుకు కేవలం ఐదుగురే పోటీ!
  •     మెడికల్ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరగడమే కారణం
  •     పలు కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజుకే, సీ కేటగిరీ సీట్లు
  •     జులై 6 నుంచి ప్రారంభం కానున్న కౌన్సెలింగ్
  •     ఈసారి లోకల్ స్టూడెంట్లకే కన్వీనర్ కోటా సీట్లు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు కాంపిటీషన్ తగ్గిపోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య, వాటిలో సీట్ల సంఖ్య పెరుగుతుండడంతో ఒక్కో సీటుకు పోటీపడే వారి సంఖ్య తగ్గుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కో సీటుకు 15 మందికిపైగా పోటీపడేవారు. తెలంగాణ వచ్చాక సీట్ల సంఖ్య పెరగడంతో.. 2021 నాటికి ఒక్కో సీటుకు ఆరుగురు పోటీ పడ్డారు. ఈసారి కాంపిటీషన్​ మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 8,515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది అదనంగా మరో 700 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఇందులో గద్వాల, వరంగల్(నర్సంపేట), యాదాద్రి, మేడ్చల్ (కుత్బుల్లాపూర్), నారాయణపేట, ములుగు, మెదక్, రంగారెడ్డి(మహేశ్వరం) జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 600 సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వంద సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇలా సీట్ల సంఖ్య ఏటికేడు పెరుగుతుండడంతో కాంపిటీషన్ తగ్గుతోంది. ఈసారి తెలంగాణ నుంచి 47,371 మంది నీట్ క్వాలిఫై అయ్యారు. ఇందులో కొంత మంది ఏపీ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తెలంగాణ అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో వారిని కూడా తెలంగాణ వారిగా సూచించారు. కౌన్సెలింగ్ సమయంలో జరిగే వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీళ్లంతా వెళ్లిపోతారు. కొత్త సీట్లను కూడా కలుపుకుంటే, ఒక్కో సీటుకు ఐదుగురు మాత్రమే పోటీ పడనున్నారు. 

కౌన్సెలింగ్ ఇలా..

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటిస్తుంది. నీట్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్ లీకేజ్, ఇతర ఆరోపణలపై సుప్రీం కోర్టులో పలు కేసులు దాఖలైనప్పటికీ.. కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో జులై 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ గురువారం కోర్టుకు తెలిపింది. జులై 6 నుంచి నేషనల్ కోటా సీట్ల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లోని సీట్లను, ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ మెడికల్ కాలేజీల్లోని సీట్లను, అన్ని రాష్ట్రాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. 

దేశంలోని ఏ ప్రాంత స్టూడెంట్​​అయినా ఈ 15 శాతం సీట్లకు పోటీ పడొచ్చు. జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు. ఎయిమ్స్ సీట్లను కూడా ఆలిండియా ర్యాంకుల ప్రకారమే కేటాయిస్తారు. మన రాష్ట్రంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్లను పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో నేషనల్ కోటాకు ఇచ్చిన 15 సీట్లు పోనూ, మిగిలిన 85 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇంకో 35 శాతం సీట్లను బీ కేటగిరీ కింద, 15 శాతం సీట్లను  సీ కేటగిరీ కింద భర్తీ చేస్తారు.

సీ కేటగిరీ సీట్లకు తగ్గిన డిమాండ్

కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థుల ఫీజులను రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాలేజీని బట్టి బీ కేటగిరీ సీట్ల ఫీజు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంది. సీ కేటగిరీ ఫీజు బీ కేటగిరీ ఫీజుకు డబుల్ ఉంటుంది. అయితే, తెలంగాణ సహా కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్లు విపరితంగా పెరిగాయి. ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు, డీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సీ కేటగిరీ సీట్లకు డిమాండ్ తగ్గింది. మన రాష్ట్రంలో అడ్డగోలు ఫీజులు చెల్లించి సీ కేటగిరీ సీటు కొనడానికి బదులు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో డీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ యూనివర్సిటీల్లో సీట్లు కొంటున్నారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో సీట్లకు డిమాండ్ తగ్గింది. ఈ కారణంగా బీ కేటగిరీ ధరకే సీ కేటగిరీ సీట్లను కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఒకట్రెండు టాప్ కాలేజీల్లో మాత్రం డబుల్ ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు.

లోకల్ స్టూడెంట్లకే ప్రయారిటీ

ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లన్నింటికీ తెలంగాణ స్టూడెంట్లు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. గతంలో ప్రభుత్వ కాలేజీల్లోని 15 శాతం సీట్లను ఏపీ, తెలంగాణ ఉమ్మడి కోటా కింద భర్తీ చేసేవారు. విభజన చట్టం ప్రకారం పదేండ్లు పూర్తి కావడంతో, ఈసారి జీవోలో మార్పులు తీసుకొచ్చి ఉమ్మడి కోటాను రద్దు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ప్రైవేటు కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు దేశంలోని ఎవరైనా పోటీ పడొచ్చు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ కోటా సీట్లకు కూడా ఎవరైనా పోటీ పడొచ్చు.