సుల్తానాబాద్ : పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను బీఆర్ఎస్ పార్టీ దాసరి మనోహర్ రెడ్డికి కేటాయించడాన్ని నిరసిస్తూ సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ జీపీ శివారు కొత్తపేటకు చెందిన పలువురు యువకులు, మహిళలు మంగళవారం ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు కల్లేపల్లి కుమార్, సాయి, శంకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు.
టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ బీఆర్ఎస్ లీడర్ నల్ల మనోహర్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. తామంతా పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్టు చెప్పారు. మనోహర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు అండగా ఉంటామన్నారు.