- ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువులు ధర్నా
చేవెళ్ల, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి బాలుడు మృ తి చెందాడని బాధిత కుటుంబం, బంధువులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధి చన్ వెళ్లికి చెందిన కుర్వ శ్రీనివాస్, సంతోష దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మనీశ్వర్(11), వర్షిత్ లు డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు నాలుగు రోజుల కిందట స్థానికంగా పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మనీశ్వర్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. మనీశ్వర్ మృతితో రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.