మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మహబూబాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లను త్వరగా పూర్తి చేసి అర్హులకు పంపిణీ చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సోమయ్య మాట్లాడుతూ డబుల్ ఇండ్ల కోసం మహబూబాబాద్‌లో 6 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారన్నారు.
200 ఇండ్లు పూర్తి కాగా, మరో 150 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించి ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమ్మెట రాజమౌళి, బానోత్ సీతారాంనాయక్, రావుల రాజు, తోట శ్రీను, యమగాని వెంకన్న పాల్గొన్నారు.