పులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలని ఆందోళన.. జేసీబీ, టిప్పర్లు ధ్వంసం

పులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలని ఆందోళన.. జేసీబీ, టిప్పర్లు ధ్వంసం

వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అమడబాకుల గ్రామస్తుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉదయం వేలాది మంది జనం పులిగుట్ట వద్దకు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మైనింగ్ పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‭ను అడ్డుకుని జేసీబీ, టిప్పర్లను ధ్వంసం చేశారు. అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. గ్రామస్తుల ఆందోళనకు జిల్లా బీజేపీ నాయకులు కొమ్ము భరత్ భూషణ్, బాల బాణెమ్మలు మద్దతు పలికారు. ఆందోళన కారుల్లో పలువురిని పోలీసులు అరెస్టు చేసి కొత్తకోట పోలీస్ స్టేషన్‭కు తరలించారు. పులిగుట్టపై మైనింగ్ వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయేంతవరకు పోరాటం చేస్తామని అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.