హైదరాబాద్: సైన్స్ పార్క్ ఇంక్యుబేటర్ అయిన ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (ఐకేపీ) తన 18వ వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్, ఇంటర్నేషనల్ నాలెడ్జ్ మిలీనియం కాన్ఫరెన్స్ (ఐకేఎంసీ) "ఐకేపీ@25: ఎన్ ఎపిక్ రాప్సోడి అండ్ ది నెక్స్ట్ సింఫనీ" అనే థీమ్‌తో హైదరాబాద్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సు సోమవారం ముగిసింది. వ్యాపార ప్రముఖులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెల్ జీన్ థెరపీ, వన్ హెల్త్, స్మార్ట్ ప్రొటీన్‌లలో సాధించిన పురోగతి, భవిష్యత్తుపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.
కాన్ఫరెన్స్ మొదటి రెండు రోజులు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగింది. స్టార్టప్ ఎగ్జిబిషన్, కీ నోట్ ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు రౌండ్ టేబుల్ చర్చలను నిర్వహించారు. స్టార్టప్ షోకేస్‌లో భాగంగా 150 మందికి పైగా ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించాయి. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ సైన్స్ పార్క్ క్యాంపస్‌లో మూడవ రోజు కార్యక్రమం జరిగింది.
రైమో టెక్నాలజీస్‌కు రూ.కోటి ఫండింగ్
స్టార్టప్ అవార్డ్స్ ఫ్యూచర్ ఫార్వర్డ్ అవార్డుల ప్రదర్శనలో రైమో టెక్నాలజీస్ టెక్నాలజీస్ సత్తా చాటింది. రూ.కోటి నిధిని పొందింది. ఫ్యూచర్ ఫార్వర్డ్ అవార్డ్స్‌లో భాగంగా కార్టోసెన్స్ రూ.50 లక్షల ఫండ్‌ను గెలుచుకుంది. ఐకేపీ ఫ్యూచర్ స్టార్స్ అవార్డ్స్‌లో మొత్తం 10 మంది ఇన్నోవేటర్లు రూ.రూ.5 లక్షల చొప్పున అందుకున్నారు. అంతేగాక 21 మంది ఎగ్జిబిటర్లు వారి ఆవిష్కరణలు, ఉత్పత్తుల కోసం రూ.17 లక్షలు అందుకున్నారు.