కొండగట్టులో బస్సు ..లారీ ఢీ కండక్టర్ మృతి

జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కండక్టర్ మృతిచెందాడు. బస్సు డ్రైవర్ తో సహా ఐదుగురు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొండగట్టు -దొంగల మరి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.