రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు

అస్సోం సీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ  కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసన చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద రేవంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నిజాం కాలేజ్ నుంచి కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ ఇంటి దగ్గరికి వచ్చిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

మరిన్ని వార్తల కోసం

నాలాల అభివృద్ధి పనులు వేగవంతం

వర్కర్స్ తిరిగొస్తున్నరు