
మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ఛైర్మన్ జి.నిరంజన్ తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని కూడా ఫిర్యాదులో చెప్పారు.
ఎన్నికల నియమావళి, మీడియాపై ఆంక్షలు, 144 సెక్షన్ అమల్లో ఉన్నా.. దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని లేఖలో వివరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రి కేటీఆర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీక్ష దివాస్ పేరుతో కేటీఆర్ కోడ్ ఉల్లంఘించారని ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:-కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇంట్లో సోదాలు