నల్గొండ జిల్లా: మునుగోడు స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల కమిషన్ బైపోల్ షెడ్యూల్ ను ప్రకటించడంతో రేపటి నుంచి క్యాంపెయినింగ్ స్పీడప్ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్... కీలక నేతలకు మండలాల బాధ్యతలు అప్పజెప్పింది. నారాయణపురం మండల బాధ్యతలను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీసుకోగా.. మునుగోడు మండల బాధ్యతలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్కు తీసుకున్నారు.
ఇక ప్రతి పోలింగ్ బూత్ లో 25మంది స్థానిక నేతలను గుర్తించి... వారికి పీసీసీ నుంచి ఇద్దరు చొప్పున కేటాయించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ మండలాల వారీగా సమీక్షలు కూడా నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.