కరీంనగర్​లో చివరి దశకు కలెక్టరేట్​ పనులు

  •    కరెంట్, కలర్స్, సీలింగ్ పనులు పూర్తికావడమే తరువాయి 
  •      ఎన్నికల దృష్ట్యా స్పీడందుకున్న నిర్మాణ పనులు
  •     నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందే పూర్తిచేయాలని మంత్రి గంగుల ఆదేశం?
  •     సీఎం చేతులమీదుగా ప్రారంభించేందుకు యోచన

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వందల సంఖ్యలో వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెట్టి పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పనులు పూర్తికాగా.. ప్రస్తుతం టైల్స్ వేస్తున్నారు. 

కరెంట్, సీలింగ్ పనులు పూర్తిచేసి కలర్స్ వేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అన్ని వసతులతో నిర్మించి ప్రారంభించారు. కాగా కరీంనగర్​లోనూ పనులు పూర్తిచేసి ఎన్నికలకు ముందే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించాలనే ఆలోచనలో మంత్రి గంగుల ఉన్నట్లు తెలిసింది. కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండడంతో  సంబంధిత కాంట్రాక్టర్ కూడా పనుల్లో వేగం పెంచారు. 

అందుబాటులోకి వస్తే అన్ని ఆఫీసులు ఒక్కచోటే.. 

కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ నిర్మాణ పనులు ఐదారేళ్ల క్రితమే మొదలై పూర్తి కాగా.. కరీంనగర్ కలెక్టరేట్ పనులు 2021 డిసెంబర్ లో ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని శంకుస్థాపన సందర్భంగా గంగుల ప్రకటించినప్పటికీ.. ఏడాదిపాటు  పనులు స్లోగా సాగాయి. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గోపి బాధ్యతలు చేపట్టాక పనుల్లో వేగం పెంచారు.  రూ.51 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని శాఖల ఆఫీసులు కొలువుదీరనున్నాయి. దీంతో వివిధ శాఖలకు సంబంధించిన పనులపై వచ్చే ప్రజలు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పనున్నాయి. 

పాత కలెక్టరేట్ కూల్చివేత.. 

కలెక్టరేట్ నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పుడే పాత కలెక్టరేట్ సగభాగాన్ని కూల్చివేశారు. అందులోని ఆఫీసులను బయట అద్దె భవనాల్లోకి తరలించారు.  మిగతా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ చాంబర్, రెవెన్యూ, అడిషనల్ కలెక్టర్లు, వీడియో కాన్ఫరెన్స్ రూమ్, ట్రెజరీ ఆఫీస్, జిల్లా శిక్షణ కేంద్రం, సీపీవో, వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై కార్పొరేషన్, ఐఅండ్ పీఆర్, డీపీఆర్వో, భూ సేకరణ విభాగం, హౌజింగ్, మెప్మా,  ఎస్బీఐ, పోస్టల్, డీటీడబ్ల్యూవో, అడల్ట్ ఎడ్యుకేషన్, ఆర్డీవో, రిజిస్ట్రేషన్ ఆఫీసులు కొనసాగుతున్నాయి. వీటిలో చాలా ఆఫీసులను ఇప్పటికే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కలెక్టర్ చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మిగతా ఆఫీసులను మార్చాక మిగతా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూల్చివేయనున్నారు.