- నత్తనడకన నల్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు
- మూడేండ్లుగా నిలిచిన రాకపోకలు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
పిట్లం, వెలుగు : కామారెడ్డి, సంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో నిర్మిస్తున్న నల్లవాగు బ్రిడ్జి పనులు ముందుకు సాగడం లేదు. 2021, జూలైలో వచ్చిన భారీ వరదల కారణంగా 60 ఏండ్ల కింద నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. గత ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేయగా, కొత్తగా బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్, సిల్గాపూర్ ప్రాంతాల ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లు, కూరగాయల మార్కెట్తదితర అవసరాల కోసం పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలోని పిట్లంకు వస్తారు.
రెండు జిల్లాల మధ్య వారధి అయిన ఈ బ్రిడ్జి పనులు నెమ్మదిగా సాగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో బస్సులు రావడం లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో బ్రిడ్జి పక్కనే తాత్కాలికంగా రోడ్డు వేశారు. అది గతేడాది వర్షాలకు కొట్టుకుపోయింది. బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేసి, బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పిట్లం, వెలుగు: కామారెడ్డి, సంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో నిర్మిస్తున్న నల్లవాగు బ్రిడ్జి పనులు ముందుకు సాగడం లేదు.
2021, జూలైలో వచ్చిన భారీ వరదల కారణంగా 60 ఏండ్ల కింద నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. గత ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేయగా, కొత్తగా బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్, సిల్గాపూర్ ప్రాంతాల ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లు, కూరగాయల మార్కెట్తదితర అవసరాల కోసం పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలోని పిట్లంకు వస్తారు.
రెండు జిల్లాల మధ్య వారధి అయిన ఈ బ్రిడ్జి పనులు నెమ్మదిగా సాగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో బస్సులు రావడం లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో బ్రిడ్జి పక్కనే తాత్కాలికంగా రోడ్డు వేశారు. అది గతేడాది వర్షాలకు కొట్టుకుపోయింది. బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేసి, బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.