హైదరాబాద్ అభ్యర్థికి బీజేపీ కసరత్తు

హైదరాబాద్‍, వెలుగు:హైదరాబాద్ ఎంపీ సీటుపై రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి .నామి నేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 25 వ తేదీ వరకు గడువు ఉంది. ఇక్కడి నుం చి బరిలో నిలిచేం దుకు బీజేపీ పార్టీలోని కొందరు పావులు కదుపుతున్నా రు. ఎలాగైనా అధిష్ఠా నాన్ని ఒప్పించి పోటీ చేయాలని కొందరు ఉవ్విళ్లూ ఊరుతున్నా రు. దీని కోసం ఎవరికి వారే తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రు. మజ్లిస్ కు పట్టు ఉన్న స్థానంలో పేరున్న అభ్యర్థిని బరిలోకి దించాలని బీజీపీ అధిష్ఠా నం భావిస్తున్నట్టు తెలిసింది. దుకోసం పార్టీలో క్రియాశీలక పదవుల్లో కొనసాగుతున్న సీనియర్‌‌ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, మహిళను పోటీలో ఉంచనున్నట్లు పార్టీ వర్గాల తెలుస్తోం ది. తెలంగాణలో బీజేపీకి అంతో ఇంతో పట్టున్న ప్రాంతమే దైనా ఉందంటే అది గ్రేటర్‌‌ ఒక్కటే. ఇక్కడి నుం చి పార్టీలో సీనియర్‌‌ను, ఆ ప్రాంతంపై గట్టి పట్టున్న వ్యక్తిని పోటీకి దిం పాలని పార్టీ ఆలోచన చేస్తుం ది. ఇందులో భాగంగా గ్రేటర్‌‌ బీజేపీ ఉపాధ్యక్షుడు ఉమామహేంద్ర బరిలో నిలపాలని చూస్తున్నట్లు వినికిడి . ఉమామహేంద్ర మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్‌‌ నియోజకవర్గం నుం చి పోటీ చేసి ఎంఐఎంకు గట్టి పోటీనిచ్చారు. అలాగే చాం ద్రాయణగుట్ట నుం చి పోటీ చేసిన షెహజాదీ, మీరాలంమండీ ప్రాంతానికి చెందిన పార్టీ సీనియర్‌‌ నేత జి.హన్మంతరావుతోపాటు సుల్తాన్‌‌షా హీ మాజీ కార్పొరేట ర్‌‌, పాశం సురేం దర్‌‌లు ఈ స్థానం నుంచి బరిలో నిలువాలని ఉత్సాహంతో ఉన్నట్లు తెలిసిం ది. అయితే గతంలో ఇక్కడి నుంచి బరిలో దిగిన భాగ్యనగర్‌‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌ రావుకు సుమారు మూడు లక్షల ఓట్లు వచ్చాయి .ఎంఐఎం పార్టీకి ఆయన గట్టి పోటీ ఇచ్చారు. ఈయన కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేం దుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.