హనుమాన్ శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర కొనసాగుతోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి తాడ్ బండ్ వరకు మొత్తం 21 కిలో మీటర్లు ర్యాలీ కొనసాగనుంది. కరోనా ఎఫెక్ట్ తో రెండేళ్లుగా సిటీలో హనుమాన్ శోభాయాత్ర జరగలేదు. ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో హైదరాబాద్ సిటీ, రాచకొండ కమిషనరేట్ల నుంచి రెండు శోభాయాత్ర ర్యాలీలను నిర్వహిస్తున్నారు. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 8 వేల మంది పోలీసులు, 550 సీసీ కెమెరాలు, 4 మౌంటెడ్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. మరోవైపు గౌలిగూడ రామమందిరం నుంచి యాత్ర మొదలై రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద శోభాయాత్ర ముగియనుంది. 

మరిన్ని వార్తల కోసం

 

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలె

తెలంగాణలో రాహుల్ టూర్ ఖరారు!