గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా గ్రామ పంచాయతీల పట్ల నిర్లక్ష్యం వహించింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని.. లేటెస్ట్ గా వీధి లైట్లు తీసుకెళ్లాడు ఓ కాంట్రాక్టర్. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో జరిగింది.
కొడిమ్యాల మండల వ్యాప్తంగా 2022 దసరా పండుగ సంధర్భంగా కరీంనగర్ కు చెందిన శ్రీనాథ్ రెడ్డి అనే కాంట్రాక్టర్ హై మాస్ లైట్లను పలు గ్రామాల్లో అమర్చాడు. ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి హామీ మేరకు లక్షా 30 వేలు విలువ చేసే 36 హైమస్ లైట్లను పలు గ్రామాల్లో అమర్చాడు. అయితే ఏడాది గడిచినా లైట్లకు ఎలాంటి ప్రొసిడింగ్స్ కానీ.. బిల్లులు కానీ ఇవ్వకుండా ప్రజాప్రతినిధి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కాంట్రాక్టర్ ఆరోపించారు. చేసేదేం లేక తాను అమర్చిన లైట్లను తీసుకెళ్లినట్లు ఆ కాంట్రాక్టర్ తెలిపాడు.
అయితే ఎలాంటి ప్రోసెసింగ్ గానీ, కాంట్రాక్ట్ లేకుండా అసలు లైట్లు బిగించడం వెనుక లక్షల్లో అవినీతి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి.