మెడికో ప్రీతిది హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. శవానికి ట్రీట్ మెంట్ చేసి ఠాగూర్ సినిమా చూపించారని చెప్పారు. ప్రభుత్వం నిందితుడ్ని కాపాడే ప్రయత్నం చేస్తోందన్న ఆయన.. ఆధారాలు తారుమారు చేశారని ఆరోపణలు చేశారు. ప్రీతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే దారుణం జరిగేది కాదని బండి సంజయ్ మండి పడ్డారు. ప్రీతి హత్య కేస సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీలు మాయం చేసే చిల్లర సంస్కృతి ఈ ప్రభుత్వానిదని విమర్శించారు. ప్రీతి మృతి కేసుపై మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. హోంమంత్రి పాతబస్తీకే హోంమంత్రి అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు రబ్బర్ స్టాంపులుగా మారారన్నారు. రేపు మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిరసన చేస్తాం.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండాలోని ప్రీతి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ స్థానిక నాయకుల యత్నించారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు.